డచ్‌ పౌరులకు బిజినెస్‌ వీసా

డచ్‌ పాస్‌పోర్టుదారులకు ఐదేళ్ల బిజినెస్, టూరిస్టు వీసా ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా హేగ్స్‌లో భారత సంతతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. గంటసేపు ప్రధాని చేసిన ప్రసంగంలో భారత్‌ అభివృద్ధి, మహిళా సాధికారత, తమ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రధానంగా మాట్లాడారు. ‘‘భారత ప్రధాని మీ జేబులో ఉండాలని అనుకుంటున్నారా?’’ అంటూ మోడీ ప్రశ్నించి నమో మొబైల్‌ యాప్‌ గురించి ప్రస్తావించారు.  అనంతరం మూడు దేశాల(పోర్చుగల్‌, అమెరికా, నెదర్లాండ్స్‌) పర్యటనను ముగించుకున్న మోడీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు.