టెక్స్ టైల్ రంగం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు

టెక్స్ టైల్ రంగంలో ప్రపంచంలోనే  భారత్ రెండో స్థానంలో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు టెక్స్ టైల్ రంగం ద్వారానే ప్రపంచ గుర్తింపు పొందాయన్నారు. తెలంగాణ, ఒడిశాలు చేనేత రంగం, బనారస్, కాంచిపురం నగరాలు సిల్క్ తో ప్రపంచ ప్రసిద్ధికెక్కాయన్నారు ప్రధాని. దేశంలో బట్టలు, లైఫ్ స్టైల్ ఉత్పత్తుల మార్కెట్ 2025కల్లా దాదాపు రెట్టింపు కానున్నదని చెప్పారు.

గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ టెక్స్ టైల్ సమ్మిట్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, దాదాపు వంద దేశాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు.