టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గుడ్ బై

టీమిండియా కోచ్ పదవికి గుడ్ బై చెప్పారు అనిల్ కుంబ్లే. నేటితో ఆయన కాంట్రాక్టు ముగియడంతో…కోచ్ పదవిలో కొనసాగబోనని ప్రకటించారు. దీంతో వెస్టిండీస్ పర్యటనకు కోచ్ లేకుండానే బయల్దేరి వెళ్లింది టీమిండియా. కోచ్ పదవి కోసం కుంబ్లే తో పాటూ సెహ్వాగ్ వంటి ఆయన సమకాలికులు కూడా పోటీలో ఉన్నారు. అయితే గత కొంత కాలంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీతో ఆయనకు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి కోచ్ పదవిపై ఆసక్తి చూపుతారా? లేదా? అన్నది అనుమానంగా మారింది.