టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న వెస్టిండీస్

క్వీన్స్‌పార్క్‌  వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో.. టాస్‌ గెలిచిన విండీస్‌ సారథి జేసన్‌ హోల్డర్‌ ఫీల్డింగ్ తీసుకున్నారు. తొలి వన్డే ఆడిన జట్టునే సారథి కోహ్లీ ఎంచుకున్నాడు. స్టేడియంలో ఉదయం నుంచి వర్షం పడడంతో టాస్‌ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ముగ్గురు బౌలర్లు 9, ఇద్దరు 8 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఈ మైదానంలోనే జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు ఉంది.