టాస్‌ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న శ్రీలంక

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇండియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ‌టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగుతున్న ఇండియా.. గెలిస్తే సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంటుంది. తొలి మ్యాచ్‌లో ఓడి శ్రీలంక ఒత్తిడిలో ఉండ‌గా.. పాక్‌పై గెలుపు ఇచ్చిన కిక్కుతో విరాట్ సేన బ‌రిలోకి దిగుతున్న‌ది. పాకిస్థాన్‌తో ఆడిన టీమ్‌నే ఈ మ్యాచ్‌కూ భార‌త్ కొన‌సాగించింది. శ్రీలంక మాత్రం మూడు మార్పుల‌తో ఈ మ్యాచ్ ఆడుతున్నది.