టామ్ కామ్ చైర్మన్ గా బోయపల్లి రంగారెడ్డి

తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ(టామ్‌కామ్) ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ సీనియర్ నేత బోయపల్లి రంగారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపన నుంచి రంగారెడ్డి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రంగారెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామం.