టంగుటూరుకు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం టంగుటూరుకు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని చూసి బంధువులు, స్నేహితులు శోక సముద్రంలో మునిగిపోయారు. పోలీసు లాంఛనాలతో ప్రభాకర్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభాకర్‌రెడ్డి మృతదేహానికి ఇంటెలిజెన్స్ డీఎస్పీ మనోహర్, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది నివాళులర్పించారు. నిన్న కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు.