జై లవకుశ లీక్.. సీసీఎస్ లో ఫిర్యాదు

జై లవకుశ సినిమా టీజర్, కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు బాబీ, కల్యాణ్ రాం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ ఎడిటర్ గణేష్ పై వాళ్లు అనుమానం వ్యక్తం చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. లీకేజీ వెనుక ఇంకా ఎవరెవ‌రు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు‌.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ జై లవకుశ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేస్తామని టీం ఇటీవల ప్ర‌క‌టించింది. వచ్చే నెల మొద‌టి వారంలో టీజ‌ర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది. ఇంత‌లోనే టీజ‌ర్ కి సంబంధించిన కొన్ని విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ షాక్ కి గురైంది.