జైల్లో శశికళలతో టీటీవీ దినకరన్ ములాఖాత్

అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్…బెంగళూరు వచ్చారు. పరప్పణం అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న తన మేనత్త శశికళను ఆయన ములాఖాత్ పై కలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటూ వ్యక్తిగత అంశాలపై శశికళతో ఆయన మాట్లాడారు. రెండాకుల కేసులో అరెస్టయి…బెయిల్ పై వచ్చిన ఆయన…తొలిసారి శశికళను కలిశారు. అన్నాడీఎంకేలో దినకరన్ తో పాటూ శశికళ కుటుంబ సభ్యలు ప్రాభవం తగ్గింది. వారందరినీ పార్టీకి దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మేనత్త శశికళతో దినకరన్ చర్చించినట్లు సమాచారం.