జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ

ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. వచ్చే నెల 1నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి రానుండడంతో.. రాష్ట్రాల విజ్ఞాపనల మేరకు సవరించిన పన్నురేట్ల జాబితాపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే దాదాపు 90% వస్తువులపై ఎంత మేరకు పన్ను విధించి ఏ శ్లాబ్‌లో చేర్చాలన్నదానిపై స్పష్టత వచ్చినప్పటికీ కొన్ని రంగాల ప్రతినిధులు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసి పన్నును తగ్గించాలని కోరారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు వస్తువులు, సేవలపై పన్నుల్ని మార్చడం, ముసాయిదా మార్గదర్శకాలకు స్వల్ప సవరణలు చేయడం సహా పలు అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు.