జూలై 17న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్  విడుదలైంది. జూలై 24న ప్రణబ్  పదవీకాలం ముగియనుండడంతో.. రాష్ట్రపతి ఎన్నికకు విధి విధానాలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెల్పింది. జూన్‌ 28న నామినేషన్ల ప్రక్రియ ముగియనుందని, జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు  చీఫ్  ఎలక్షన్‌   కమిషనర్‌   నసీమ్   జైదీ ప్రకటించారు. జూలై 20న ఫలితాలు ప్రకటించనున్నట్లు చెప్పారాయన. రహస్య బ్యాలెట్  పత్రం ద్వారా పోలింగ్‌   నిర్వహిస్తామని,  ఏ పార్టీ కూడా తన సభ్యులకు విప్  జారీ చేయకుడదని సూచించారు.