జూన్ 2కల్లా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం

ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నిర్మాణం వచ్చే దసరా నాటికి, అన్ని జిల్లాల సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేస్తామన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి డిపార్టుమెంట్ చేపడుతున్న బిల్డింగుల నిర్మాణంపై రివ్యూ చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లకు రూ.1000 కోట్ల ఖర్చుతో కొత్త భవనాల నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, దీంతో వీటి నిర్మాణం వేగంగా చేపడుతున్నామన్నారు మంత్రి తుమ్మల.