జీశాట్ -17 సక్సెస్

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. మరో భారీ రాకెట్‌   ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రెంచి గయాలోని అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌ -17 ఉప గ్రహాన్ని సక్సెస్‌   ఫుల్‌   గా ప్రయోగించింది. మొత్తం 42 ట్రాన్స్  పండర్లను పంపడంతో.. సమాచార రంగంలో ట్రాన్స్‌  ఫాండర్ల కొరత తీరనుంది. సుమారు 15 ఏళ్లపాటు జీశాట్-17 ఉపగ్రహం సేవలందించనుంది. ఐతే.. అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపే వసతులు మనదగ్గర లేకపోవడంతో ఫ్రెంచి గయాన నుంచి పంపించారు. ఈ రాకెట్‌  బరువు 3 వేల 425 కిలోలు.  15ఏళ్లపాటు సేవలందించనుంది జీశాట్‌.