జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష  పరిశోధన  సంస్థ ఇస్రో.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు  రూపొందించిన  జీఎస్ ఎల్ వీ మార్క్-3డీ వన్ పరీక్ష విజయవంతమయ్యింది. శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముతూ జీశాట్ఉపగ్రహాన్ని జీఎస్ ఎల్ వీ మార్క్-3 నింగిలోకి మోసుకెళ్లింది. కేవలం 16 నిమిషాల 20 సెకన్లలో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. జీశాట్రోదసి నుంచి పదేళ్ల పాటు సేవలందించనుంది. డిజిటల్  ఇండియా స్పూర్తితో పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన ఈ ఉప గ్రహం.. ఇస్రో చరిత్రలో అత్యంత బరువైనది. ఈ ప్రయోగంతో సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.