జీఎస్టీ సమావేశానికి హాజరుకానున్న మంత్రి కేటీఆర్

ఇవాళ ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి.. రాష్ట్రం తరపున మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ కుమారుడి వివాహం కారణంగా సమావేశానికి రాలేకపోతున్నందున.. మంత్రి కేటీఆర్‌ సమావేశంలో పాల్గొననున్నారు.  కేంద్ర ఆర్థిక మంత్రి అరున్‌ జైట్లీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్‌ వివరిస్తారు. లాటరీలపై ఎంత శాతం పన్ను విధించాలనే అంశంతో పాటు ఎలక్ట్రానిక్‌ వే బిల్‌ వ్యవస్థపై నిబంధనలను రూపొందించడంపై చర్చ జరగనున్నది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం, బీడీ, గ్రానైట్‌ పరిశ్రమలను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి స్పష్టం చేయనున్నారు. చేనేత వస్త్రాలతో పాటు గార్మెంట్స్‌ తదితరాలపై కూడా  పన్ను తగ్గించాలని కోరనున్నారు.