జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నాం

జీఎస్టీని టీఆర్ఎస్ తరపున సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నామని ఎంపీ వినోద్ తెలిపారు. జీఎస్టీ ప్రారంభోత్సవానికి తాము హాజరవుతున్నామని చెప్పారు. జీఎస్టీ వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశముందన్నారు. అందుకే కొన్ని అంశాలపై కేంద్రానికి అభ్యంతరాలను తెలియజేశామన్నారు వినోద్.  మరో ఎంపీ బాల్క సుమన్ తో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.