జీఎస్టీని స్వాగతిస్తున్నాం

ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నదని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే జీఎస్టీతో అధిక భారం పడే వాటిపై మరోసారి కేంద్రం సమీక్ష జరపాలని సూచించారు. వృద్ధి రేటుతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు నష్టం కలిగే వస్తులపై పరిహారం ఇవ్వాలని కోరారు. ఎన్డీఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ చేతనైతే అధిక భారం పడే వస్తువులపై మినహాయింపు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.