జాతీయ విద్యావిధానం తుది ముసాయిదా కమిటీ

జాతీయ విద్యా విధానం తుది ముసాయిదా రూపకల్పనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రఖ్యాత సైంటిస్ట్ కస్తూరి రంగన్ చైర్మన్ గా తొమ్మిది మందితో కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా మాజీ ఐఏఎస్‌ అధికారి  కె.జె.ఆల్ఫోన్స్‌, అంబేద్కర్‌ వర్సిటీ వీసీ రామ్‌శంకర్‌ కురీల్‌, కర్ణాటకకు చెందిన ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు ఎంకే శ్రీధర్‌, ప్రముఖ భాషా నిపుణులు కత్తిమణి, గౌహతి వర్సిటీ అధ్యాపకుడు మజహర్‌ హసీఫ్‌, ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మాజీ డైరెక్టర్‌ క్రిషన్‌ మోహన్‌ త్రిపాఠి, ప్రముఖ గణాంక నిపుణులు మంజుల్‌ భార్గవ ఉన్నారు.