జర్నలిస్టుల హెల్త్ స్కీం ప్రపంచంలోనే ప్రత్యేకం

సకల జనుల సంక్షేమంతో తెలంగాణ సర్కారు దూసుకెళుతోంది..! బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సర్కారు… ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది..! సమైక్య రాష్ట్రంలో పడకేసిన వైద్యరంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది..! సర్కారు దవాఖానాలను కార్పొరేట్ తరహాలో మార్చేసింది..! ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల హెల్త్ స్కీంను ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తోంది..! గతంలో ప్రీమియం చెల్లించినా అంతంత మాత్రంగానే ఆరోగ్య సేవలు ఉండేవి..! కానీ తెలంగాణ సర్కారు ప్రీమియం లేకుండానే ఉచితంగా ఉద్యోగులకు, జర్నలిస్ట్‌లకు మెరుగైన వైద్యసేవలు అందిస్తోంది..! ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది..! ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్ట్‌లతో పాటు రిటైర్ట్ ఎంప్లాయిస్, పెన్షనర్లకు కూడా వెల్‌ నెస్‌ సెంటర్లలో ఉచిత వైద్యం అందిస్తున్నారు..!

2016 డిసెంబర్ 17న ఖైరతాబాద్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ని ప్రారంభించారు. ఇందులో అన్ని రకాల రోగాలకు చికిత్స చేస్తున్నారు. అలోపతితో పాటు ఆయుర్వేదం, హోమియో వైద్య సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌ వేలాది మందికి ఉచితంగా వైద్యసేవలు అందించింది. ఇప్పటివరకు ఓవరాల్‌గా 43 వేల 7 వందల 13 మంది జనరల్ మెడిసిన్ విభాగంలో ట్రీట్‌మెంట్ పొందారు. గైనకాలజీలో 1544, ఆర్థోపెడిక్ విభాగంలో 2407, కార్డియాలజీలో 1280, ఆప్తమాలజీ 3125, పీడియాట్రిక్ 576, డయాబెటాలజీలో 200, న్యూరాలజీ 30 మందికి వైద్యం అందించారు. వీటితో పాటు ఆయుర్వేదిక్ విభాగంలో 913 మంది, యునానీ విభాగంలో 401, యోగా నేచురోపతి 447, ఫిజియో థెరపీ విభాగంలో 4172, డెంటల్ విభాగంలో 5416 మందికి ట్రీట్‌మెంట్‌ చేశారు. ఇక వైద్య పరీక్షల విషయానికొస్తే ల్యాబ్-1 ద్వారా 60 వేల 955 మంది, ల్యాబ్-2 ద్వారా 7405 మంది టెస్ట్‌లు చేయించుకున్నారు. మొత్తం 36 వేల 100 మంది ఉచితంగా మందులు తీసుకున్నారు. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌ ప్రారంభించిన ఏడాదిలోనే వేలాది కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించింది.

ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో మరో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. నాలుగు నెలల్లోనే ఇక్కడ కూడా ఎంతో మంది వైద్యసేవలు పొందారు. జనరల్ ఫిజీషియన్‌ విభాగంలో 13 వేల 167, గైనకాలజీలో 276, ఆర్థోపెడిక్స్ విభాగంలో 1390, కార్డియాలజీలో 698, ఫిజియో థెరపీలో 17 వందల 17, డెంటల్‌ విభాగంలో 1554… ఇలా మొత్తం 18 వేల 802 మంది ఓపీ సేవలు అందుకున్నారు. వనస్థలి పురం వెల్‌నెస్ సెంటర్‌లో 24 వేల 491 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 12 వేల 127 మందికి ఉచితంగా మందులు అందజేశారు.

వెల్‌నెస్ సెంటర్లలో ఉచిత వైద్యం అందించడంతో పాటు పెద్ద జబ్బుల బారిన పడ్డ రోగులను కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్ల పనితీరుపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాన సర్కారు ప్రీమియం లేకుండానే మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందిస్తోందని చెబుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో మొత్తం 14 వెల్‌నెస్ సెంటర్లు నెలకొల్పేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.