జబ్ హ్యారీ మెట్ సెజల్‌ టీజర్‌ రిలీజ్!

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ లేటెస్ట్ మూవీ జబ్ హ్యారీ మెట్ సెజల్‌ టీజర్‌ విడుదలైంది. షారూఖ్, అనుష్క శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన 36 సెకన్ల టీజర్ ను మినీ ట్రైల్-1 పేరుతో విడుదల చేశారు. షారూఖ్, అనుష్క మధ్య సంభాషణను ఇందులో చూపించారు. ఆగస్టు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్‌ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.