ఛాలెంజింగ్ పాత్రలో పూజా కుమార్

విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాల్లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించి మంచి కథానాయికగా గుర్తింపును సంపాదించుకుంది పూజాకుమార్. తాజాగా ఆమె రాజశేఖర్ సరసన కథానాయికగా నటిస్తున్న చిత్రం పి.ఎస్.వి.గరుడవేగ. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌సత్తారు దర్శకుడు. ఈ సినిమాలో పూజా కుమార్ స్వాతి అనే పాత్రను పోషిస్తున్నది. కథాగమనంలో ఆమె పాత్ర చాలా కీలకంగా వుంటుందని, రాజశేఖర్ భార్యగా… ఆరేళ్ల బాబుకు తల్లిగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని చిత్ర బృందం చెబుతున్నది. తన కెరీర్‌లో మరో ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నానని పూజాకుమార్ ఆనందం వ్యక్తం చేసింది. అరుణ్ అదిత్, కిషోర్, రవివర్మ, చరణ్‌దీప్, నాజర్, షాయాజీషిండే, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.