ఛాలెంజింగ్‌ రోల్‌లో అనుష్క!

కథానాయికగానే కాకుండా నిర్మాతగా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రతిభను చాటుతున్నది అనుష్కశర్మ. ఎన్.హెచ్. 10, ఫిల్లోరి చిత్రాలతో నిర్మాతగా చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా పరి అనే పేరుతో మరో సినిమాను నిర్మిస్తున్నది. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్న అనుష్కశర్మ..  ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం. నీలికళ్లు, పాలిపోయిన ముఖంతో డీ గ్లామర్ లుక్‌తో ఉన్న చిత్ర ఫస్ట్‌లుక్‌ను అనుష్కశర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలిపింది. ప్రోసిత్‌రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.