చ‌రిత్ర సృష్టించిన దంగ‌ల్

అమీర్‌ఖాన్ దంగ‌ల్ రికార్డులు సృష్టిస్తున్నది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.2000 కోట్లు వ‌సూళ్ల సాధించిన తొలి ఇండియ‌న్ సినిమాగా కొత్త చ‌రిత్ర సృష్టించింది. చైనాలో 53వ రోజు రూ.2.5 కోట్లు వసూలు చేసిన దంగ‌ల్‌.. ఈ అరుదైన మార్క్‌ను అందుకున్న‌ట్లు ఫోర్బ్స్ వెల్ల‌డించింది. అటు హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ కెప్టెన్ అమెరికా, ట్రిపుల్ ఎక్స్‌, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌, టైటానిక్ 3డీ, ద జంగిల్ బుక్‌, కుంగ్ ఫు పాండా 3 లాంటి సినిమాల క‌న్నా ఎక్కువ వ‌సూళ్లు దంగ‌ల్ రాబ‌ట్టింది. దంగ‌ల్ ఒక్క చైనాలోనే 1200 కోట్ల‌కుపైగా వ‌సూలు చేయ‌డం విశేషం. ఇండియాలో కంటే దాదాపు రెట్టింపు వ‌సూళ్లు చైనాలోనే సాధించింది. రెజ్ల‌ర్ మ‌హావీర్ సింగ్ ఫోగాట్ జీవిత‌చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.