చైనా అధ్యక్షుడు మెచ్చిన ‘దంగల్’

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దంగల్  మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది..రీసెంట్ గా చైనా లో విడుదలై 1100 కోట్ల కలెక్షన్స్ తో చైనాలో టాప్ గ్రాసింగ్  నాన్ హాలీవుడ్ ఫిల్మ్ గా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా చైనా అధ్యక్షుడి మనుసుగెలుచుకుంది..దంగల్ మూవీ సూపరంటూ చైనా ప్రెసిండెంట్ జిన్ పెంగ్ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు.

షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు..ఇద్దరు నేతల మధ్య సీరియస్ చర్చలు జరిగాయి.. చర్చల మధ్యలో సినిమాల గురించిన ప్రస్థావన వచ్చింది..ఈ సందర్బంగా జిన్ పింగ్  రీసెంట్ గా చైనా లో రిలీజై సూపర్ హిట్టైన అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ దంగల్  తనను ఎంతగానో ఆకట్టుకుందని మెచ్చుకున్నారు.

దంగల్ సినిమాని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని..సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిందని ఇలాంటి సినిమాలు చైనా లో మరిన్ని రిలీజ్ కావాలని ప్రధాని మోడీతో చెప్పారు.

మే 5న చైనాలో రిలీజైన దంగల్ ఇప్పటికీ 7వేల థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది..రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోన్న ఈ మూవీ చైనా లో అత్యథిక వసూళ్లు సాదించిన 34 వసినిమాగా నిలవడంతో పాటు చైనా లో టాప్ గ్రాసింగ్ నాన్ హాలీవుడ్ ఫిల్మ్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది.