చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైంది. చేప ప్రసాద పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో లక్షా 20 వేల కొరమీన్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాలు సహా వివిధ రాష్ర్టాల నుంచి ప్రజలు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ప్రసాదం స్వీకరించేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని చేప ప్రసాదాన్ని స్వీకరించారు.