చెలరేగిన పాక్ ప్లేయర్లు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ దుమ్మురేపింది. టీమిండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు ఓపెనర్లు ఫఖార్, అజర్ అలీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 128 పరుగుల భారీ పార్టనర్ షిప్ నమోదు చేశారు. అద్భుత బ్యాటింగ్ తో అలరించిన ఫఖార్ 114 పరుగులు చేయగా. అజర్ అలీ 59 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మిడిలార్డర్ లో బాబర్ అజామ్ వేగంగా ఆడి 46 రన్స్ చేశాడు. మాలిక్ 12 పరుగులు చేసి భువీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక చివర్లో హఫీజ్, ఇమాద్ లు రెచ్చిపోవడంతో పాక్ మూడువందల స్కోర్ దాటింది. హఫీజ్ 57, ఇమాద్ 25 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేసింది. టీమిండియా బౌలర్లలో భువీ, పాండ్యా, జాదవ్ లకు తలో వికెట్ దక్కింది.