చెర్రీతో చిందేయనుందా?

బుల్లితెర‌పై చ‌లాకీ మాట‌ల‌తో పాటు గ్లామ‌ర్ తోను అలరిస్తున్న అన‌సూయ మ‌ధ్య మ‌ధ్య‌లో వెండితెర‌పై త‌ళుక్కుమంటుంది. క్ష‌ణం, సోగ్గాడే చిన్ని నాయ‌నా వంటి చిత్రాల‌లో న‌టించిన అన‌సూయ ఈ మ‌ధ్య వ‌చ్చిన విన్నర్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.  ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాలో అన‌సూయ ఓ స్పెష‌ల్ రోల్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ హాట్ బ్యూటీ తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో రంగ‌స్థ‌లం 1985 అనే బోర్డ్ ఫోట్ పెట్టి హియ‌ర్ అయామ్ ఆన్ బోర్డ్ అని కామెంట్ పెట్టింది. దీంతో అభిమానులంద‌రు రామ్ చ‌ర‌ణ్ -సుక్కూ చిత్రానికి అన‌సూయ గ్లామ‌ర్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కాబోతుందంటూ చెప్పుకుంటున్నారు. రంగ‌స్థ‌లం 1985 చిత్రం ప్ర‌స్తుతం రాజ‌మండ్రి పరిసర ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా ఇందులో క‌థానాయిక‌గా స‌మంత న‌టిస్తున్నది ‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నుండ‌గా, స‌మంత ప‌ల్లెటూరి పిల్ల‌గా సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.