చెన్నూరులో బీసీ, మైనారిటీ గురుకులాలు ప్రారంభం

మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీసీ గురుకుల, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. కేజీ టు పీజీ ఉచితంగా విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఓదెలు చెప్పారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.