చురుగ్గా కదులుతున్న నైరుతిరుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్  గఢ్  నుంచి  కోస్తాంధ్ర, రాయలసీమ  మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి  కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌  లోని సూర్  నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, మెహదీపట్నం, మలక్‌  పేట, చాదర్‌  ఘాట్‌, దిల్  సుఖ్‌  నగర్‌  తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. నాగర్‌  కర్నూల్  జిల్లా కల్వకుర్తి, వెల్దండ, తిమ్మాజీపేట, తెల్కపల్లిలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో కుంభవృష్టి కురిసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌  జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడింది.