గోడ కూలి 8 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ కురుస్తున్న వర్షాలతో సోలాన్ జిల్లా బద్దీలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో  విషాదఛాయలు అలుముకున్నాయి.