గొల్ల, కుర్మల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి

గొల్ల, కుర్మల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు కులవృత్తుల అభివృద్ధికి పాటుపడలేదన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గొర్రెల పెంపకందారుల ఆత్మీయ సభలో మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా  విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గొల్ల, కుర్మల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటమన్నారు.