గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన సీఎం కేసీఆర్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. సిద్దిపేట జిల్లా కొండపాకలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఒగ్గుడోలు వాయించి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించిన బీమా పత్రాలను అందజేశారు.

పంపిణీ చేయడానికి తీసుకొచ్చిన గొర్రెలను అంతకుముందు సీఎం కేసీఆర్ పరిశీలించారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలు సంప్రదాయ తలకట్టు, గొంగడితో సీఎం కేసీఆర్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.