గొర్రెల పంపిణీ చారిత్రాత్మకం

గొర్రెల పంపిణీ పథకం చారిత్రాత్మకమని టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు ప్రశంసించారు. గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. బీసీ వర్గాల కోసం రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభోత్సవంలో కేకే పాల్గొన్నారు.