గొర్రెల పంపిణీపై తలసాని వీడియో కాన్ఫరెన్స్

గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై సచివాలయం నుండి  జిల్లా కలెక్టర్లతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  జిల్లాల్లో ఆయా గ్రామాల్లో ఎంపికైన లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కాన్ఫరెన్సు లో గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేష్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ది సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.