గూర్ఖాల్యాండ్‌ లో ఆందోళన తీవ్రతరం

గూర్ఖాల్యాండ్‌  ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. జేజీఎం నేతల అరెస్టులను నిరసిస్తూ.. నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఇప్పటికే డార్జిలింగ్  లో బంద్‌   కొనసాగుతుండగా.. సమ్మెకు పిలుపు నివ్వడంతో ప్రభుత్వ ఆఫీసులన్నీ మూతపడ్డాయి. హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు  బంద్‌   పాటిస్తున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. టీ గార్డెన్‌   కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఆందోళనలతో ఇప్పటికే టూరిస్టుల రాక కూడా పూర్తిగా తగ్గిపోయింది.