గురేజ్ సెక్టార్ లో ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్‌ ఓ ఉగ్రవాదిని హతమార్చాయి భారత భద్రతా బలగాలు. గురేజ్ సెక్టార్‌  లో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాది కదలికలను గుర్తించిన సైనికులు.. కాల్పులు జరిపి మట్టుబెట్టారు. అతని నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గురేజ్ సెక్టార్ లో కూంబింగ్‌ కొనసాగుతోంది. నిన్న ఉరి సెక్టార్ లో చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

మరోవైపు, శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, భద్రతా దళాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.