గురుగ్రహం అత్యంత పురాతనమైనది!

మన సౌరవ్యవస్థలోని గ్రహాలన్నింటిలోకెల్ల గురుగ్రహం అత్యంత పురాతనమైనదిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడు ఏర్పడిన 40 లక్షల సంవత్సరాలకు గురుగ్రహం ఆవిర్భవించిందని అమెరికాలోని లారెన్స్‌ లివర్‌మోర్‌ నేషనల్‌ లేబొరేటరీ పరిశోధకులు తేల్చారు. గురుగ్రహం ఉపరితలంపై ఉన్న ఉల్క శకలాల్లోని ఐసోటోప్‌ సిగ్నేచర్‌ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు.