గుండెపోటుతో ఎంపీ పాల్వాయి మృతి

కాంగ్రెస్‌  సీనియర్‌  లీడర్‌, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌  రెడ్డి ఇకలేరు. గుండె పోటుతో ఆయన చనిపోయారు. హిమాచల్  ప్రదేశ్  లోని కులూలో… స్టాండింగ్  కమిటీ మీటింగ్  కు వెళ్లిన పాల్వాయికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. వెంటనే ఆయన్ను సిమ్లాలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. పాల్వాయి అప్పటికే మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు.

పాల్వాయి గోవర్ధన్‌  రెడ్డి.. 1936 నవంబర్ 19న నాగర్‌ కర్నూల్‌  జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో జన్మించారు. సొంతూరు నల్లగొండ జిల్లా చండూరు మండలం  ఇడికూడ గ్రామం. ఓయూ వివేకవర్దిని డిగ్రీ కాలేజీ నుంచి బీఏ పట్టా పొందారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1972, 78, 83, 99 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. భవనం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టాండింగ్‌  కమిటీ సభ్యునిగా కూడా ఉన్నారు. పాల్వాయికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.