గాంధీజీపై అమిత్ షా వివాదస్పద వ్యాఖ్యలు

మహాత్మాగాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా. గాంధీజీ తెలివైన వ్యాపారి అని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకు ముందే తెలుసన్నారు.  కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బలహీనతలు గాంధీజీకి ముందే తెలుసని, అందుకే స్వాతంత్ర్యం అనంతరం పార్టీని రద్దు చేయాలని గట్టిగా వాదించారని చెప్పారు. కాంగ్రెస్‌ కు ఓ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని విమర్శించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ పర్యటనలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.

అమిత్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. గాంధీజీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.