గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ ఇఫ్తార్ విందు

గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్ లో ఘనంగా ఇఫ్తార్ విందు  జరిగింది. యూఏఈ లోని దుబాయ్, షార్జా, అజ్మన్, రస్ అల్  ఖైమా నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ముస్లింలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్న గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ ను వారు అభినందించారు. అటు ఇఫ్తార్ సందర్భంగా ప్రొఫెసర్ సయ్యద్ ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించారు. అన్ని మతాల పండుగలు ప్రజలంతా కలిసి ఘనంగా జరుపుకునేందుకు గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తుందని సంఘం అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు.