గర్భిణులకు అంగన్ వాడీలు అవగాహన కల్పించాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా గర్భిణులకు అంగన్‌వాడి టీచర్లు అవగాహన కల్పించాలన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమైనదన్నారు. నల్లగొండ జిల్లాలో అమ్మఒడి పథకంపై అంగన్‌వాడి టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమ్మఒడి కార్యక్రమంపై అంగన్‌వాడీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు.