గచ్చిబౌలిలో విషాదం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. సుదర్శన్‌ నగర్‌లో పద్మజ అనే వివాహిత అనుమానాస్పదరీతిలో మరణించింది. పద్మజ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో మేనేజర్‌గా పనిచేస్తుంది. అయితే పద్మజకు గతేడాది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గిరీశ్‌తో పెళ్లి అయింది. అయితే గిరీశ్‌ అదనపు కట్నం కోసం పద్మజను వేధించేవాడని ఆమె బందువులు ఆరోపిస్తున్నారు. గిరీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.