ఖ‌మ్మంలో పాస్ పోర్టు సేవా కేంద్రం

స్వ‌రాష్ట్రంలో ఖ‌మ్మం జిల్లా అభివృద్దిలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఇక్కడి నాయ‌కులు ముందుకు సాగుతున్నారు. ఖమ్మం పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పోరేష‌న్  గా మార్చిన సీఎం కేసీఆర్.. ఆ వెంట‌నే ఎమ్మెల్యే అజ‌య్ విజ్ఞ‌ప్తి మేర‌కు పోలీసు క‌మిష‌న‌రేట్ ఏర్పాటు చేశారు. తాజాగా కేంద్ర విదేశీ వ్యవ‌హారాలశాఖను ఒప్పించిన ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.. పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఖ‌మ్మం ప‌ట్టణానికి తీసుకొచ్చారు. దీంతోపాటు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండలో విదేశాంగ శాఖ పాస్  పోర్టు కేంద్రాలను ప్రారంభించనుంది. ఖమ్మంలోని హెడ్‌  పోస్టాఫీసులో పాస్‌ పోర్టు సంబంధిత సేవలను అందించడానికి అనువుగా డిపార్ట్‌  మెంట్‌  ఆఫ్‌  పోస్ట్‌  భాగస్వామ్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు..

 

ఖ‌మ్మం జిల్లా నుంచి విదేశాల‌కు వెళ్లే విద్యార్థులు, వ్యాపారవేత్త‌ల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో పాస్ పోర్టు కోసం హైద‌రాబాద్ లేదంటే విశాఖ‌ప‌ట్నం , విజ‌య‌వాడ‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. ఈ మ‌ధ్యే వ‌రంగ‌ల్ లో కూడా పాస్ పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించిడం కాస్త‌లో కాస్త బెట‌ర్ గా మారింది. దీంతో ఎంపీ పొంగులేటి ఈ అంశంపై దృష్టిపెట్టారు. కేంద్రానికి లేఖ రాయ‌డంతో పాటు కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్ ను క‌లిసి ప‌రిస్థితిని వివ‌రించారు. దీంతో ఖ‌మ్మంకు పాస్ పోర్టు కేంద్రం మంజూరు అయింది. ఈ మేరకు హెడ్ పోస్టాఫీసును సందర్శించిన ఎమ్మెల్యే అజ‌య్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఎంపీ పొంగులేటికి ప్రత్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

 

పాస్ పోర్టు కోసం సూదూర ప్రాంత‌ల‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో స్థానికుల్లో హర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఖమ్మం పాస్ పోర్టు సేవా కేంద్రం వరంగా మారనుంది.