ఖమ్మం నూతన బస్టాండ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

ఖమ్మం నగరాన్ని  అన్ని  రంగాలలో అభివృద్ధి పథంలో  తీసుకెళతామని మంత్రి కేటీఆర్‌  అన్నారు.  25  కోట్లతో  వ్యయంతో  కొత్తగా  చేపట్టిన బస్టాండ్‌ నిర్మాణంను.. మంత్రులు  మహేందర్‌ రెడ్డి,  తుమ్మల నాగేశ్వర్‌ రావు,  ఆర్టీసీ ఛైర్మన్‌  సోమారపు సత్యనారాయణతో కలిసి  ఆయన  ప్రారంభించారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో  రాష్ట్రంలో  ప్రజా రవాణాను పటిష్టం చేశామని మంత్రి మహేందర్‌ రెడ్డి,  ఆర్టీసీ ఛైర్మన్‌ సత్యనారాయణ అన్నారు. ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ  90 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయని తెలిపారు. ఖమ్మం నగరంలో రహదారులను అభివృద్ధి చేశామని.. లక్కారం చెరువుతో పాటు కొత్తగా మార్కెట్‌ను నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని  కార్పొరేషన్‌ల కంటే  ఖమ్మం కార్పొరేషన్‌ ను అభివృద్ధి పరిచి.. ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  అంతకు ముందు ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రులకు..  టీఆర్‌ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గట్టయ్య సెంటర్‌కు చేరుకున్న మంత్రి డీసీసీబీ బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించారు. కాసేపట్లో ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అమెరికాకు చెందిన 7 కంపెనీలు, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ శంకుస్థాపన అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వ్యాపార అనుమతి పత్రాలు అందుకోనున్నారు.