ఖతార్ ఉగ్రవాద పోషక దేశం

అరబ్ దేశాల దిగ్బంధంలో ఉన్న ఖతార్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద పోషక దేశంగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి ధనసహాయాన్ని వెంటనే నిలిపివేయాలని, విద్వేష బోధలను ఆపాలని ఖతార్‌కు స్పష్టం చేశారు. మొదటినుంచీ ఖతార్‌కు ఉగ్రవాదానికి నిధులు సరఫరా చేయడం అలవాటేనని, పైగా ఉన్నతస్థాయిలో ఇది జరుగుతున్నదని ట్రంప్ ఆరోపించారు. రుమేనియా అధ్యక్షుడు క్లావుస్ జొహానిస్‌తో వైట్‌హౌస్ రోజ్ గార్డెన్‌లో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖతార్‌తోపాటుగా ఉగ్రవాదానికి అండదండలు అందిస్తున్న ఇతరదేశాలు కూడా ఆ పని వెంటనే నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు.