ఖతార్‌కు సహచర అరబ్ దేశాల షాక్

ఖతార్‌కు సహచర అరబ్  దేశాలు షాక్ ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలతో ఖతార్ తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు.. సౌదీ అరేబియా, యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్‌, బహ్రేయిన్ ప్రకటించాయి. తక్షణమే ఖతార్ కు చెందిన దౌత్యాధికారులు దేశాన్ని విడిచి వెళ్లాలని బహ్రేయిన్ ఆదేశించింది. ఇక ఖతార్  కు చెందిన  పౌరులు 14 రోజుల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని తెలిపింది. ఉగ్రవాదం నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ తెలిపింది. ముస్లిం బ్రదర్‌  హుడ్‌ తో సహా పలు ఉగ్రసంస్థలకు ఖతార్‌  మద్దతు ఇస్తోందని ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఖతార్ మాత్రం.. నాలుగు దేశాల నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ నిర్ణయం దేశ ప్రజలపై ప్రభావం చూపించబోదని తెలిపింది.