క‌శ్మీర్‌లో పాక్ కుయుక్తులు ప‌నిచేయ‌వు

క‌శ్మీర్‌లో శ‌త్రు దేశం పాకిస్థాన్ చేప‌డుతున్న విష ప్ర‌చారం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉన్నామ‌ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ తెలిపారు. దేశ సార్వ‌భౌమాధికారానికి ఎటువంటి విఘాతం క‌ల‌గ‌కుండా చూసుకునేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు నిత్యం అప్ర‌మ‌త్త‌తో ఉన్నాయ‌ని చెప్పారు. అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌న్నారు. బ‌య‌టి, లోప‌లి శ‌క్తుల‌ను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉంద‌న్నారు. సోష‌ల్ మీడియా ద్వారా క‌శ్మీర్‌లో పాకిస్థాన్ విష ప్ర‌చారం చేస్తున్న‌ద‌ని, అక్క‌డి యువ‌త‌ను టార్గెట్ చేస్తున్నార‌ని, కానీ ఆ ఎత్తులో ఎప్ప‌టిక‌ప్పుడూ అడ్డుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు. క‌శ్మీర్‌లో త్వ‌ర‌లో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌న్నారు. భార‌త ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఆర్మీని ఆధునీకరిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.