కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది.చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చేసిన 96 పరుగులతో కోహ్లీ 8 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. చాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 40 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 261 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 46 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 96 పరుగులు సాధించాడు. రోహిత్ చక్కటి ఇన్నింగ్స్ తో సెంచరీ నమోదు చేశాడు.