కోయంబత్తూర్ లో జస్టీస్ కర్నన్ అరెస్ట్

కోల్ కత్తా హైకోర్టు జడ్జీ జస్టిస్ కర్నన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరులో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు…కోల్ కత్తా తరలిస్తున్నారు. కోర్టు ధిక్కారం కేసులో జస్టిస్ కర్నన్ ను అరెస్ట్ చేయాల్సిందిగా…సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది. అయితే మే 9 నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గతంలో పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలపై ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ..ఆయన లెక్క చేయలేదు. దీంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు కూడా కర్నన్ నోటీసులు జారీ చేశారు.