కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల క్రికెట్ జట్టు కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేశాడు. ప్రధాన కోచ్ పదవికి మే నెలలో బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు మే 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ.. ఇటీవలే అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం.. తక్కువ దరఖాస్తులు రావడంతో మళ్లీ గడువును పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నిర్ణయంతో కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. “నేను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను” అని ఓ  మీడియా సంస్థకు రవిశాస్త్రి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.